తన శరీర ఛాయపై ట్రోల్ చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి
- త్రినయని సీరియల్ తో ఎంట్రీ ఇచ్చిన శ్రుతిదాస్
- గత కొన్నాళ్లుగా డైరెక్టర్ తో ప్రేమ
- నల్లగా ఉందంటూ ట్రోలింగ్
- ఈమెయిల్ ద్వారా సైబర్ పోలీసులకు ఫిర్యాదు
సోషల్ మీడియా ట్రోలింగ్ ను పట్టించుకోవద్దని తనకు చాలామంది సూచించారని, ఆ విధంగానే ఇప్పటివరకు మౌనంగా ఉన్నానని తెలిపారు. తన మొట్టమొదటి టీవీ సీరియల్ త్రినయని దర్శకుడితో ప్రేమలో ఉన్నానని, ఈ విషయం వెల్లడి కావడంతో సోషల్ మీడియాలో వేధింపులు అధికం అయ్యాయని శ్రుతి పేర్కొన్నారు. తన వ్యక్తిత్వాన్ని, తన ప్రతిభను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఈమెయిల్ ద్వారా బెంగాలీ నటి శ్రుతి దాస్ ఫిర్యాదును స్వీకరించినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.