Kathi Mahesh: కత్తి మహేశ్ చికిత్సకు రూ. 17 లక్షలు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం

AP Govt pays Rs 17 lakhs for Kathi Mahesh treatment
  • నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన కత్తి మహేశ్
  • చెన్నై అపోలో ఆసుపత్రిలో మహేశ్ కు చికిత్స 
  • సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆసుపత్రికి డబ్బు చెల్లించిన ప్రభుత్వం
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదానికి గురైన సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ కు ఏపీ ప్రభుత్వం ఆర్థికసాయాన్ని అందించింది. గత నెల 26న కారులో వెళ్తున్న మహేశ్ ఎదురుగా వెళ్తున్న లారీని వేగంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయమైంది. కళ్లు ప్రమాదానికి గురయ్యాయి. ప్రస్తుతం ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్య చికిత్సకు గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సాయం చేసింది. రూ. 17 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ కింద అపోలో ఆసుపత్రికి చెల్లించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
Kathi Mahesh
Appolo Hospital
AP Government
Fincial Assistance

More Telugu News