Chhattisgarh: ఎదురుకాల్పుల్లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతం

  • బస్తర్ జిల్లాలో ఘటన
  • 45 నిమిషాలపాటు ఎదురు కాల్పులు
  • తప్పించుకున్న మరికొందరు మావోయిస్టులు
Maoinst Deputy Commander killed in an Encounter

చత్తీస్‌గడ్‌, బస్తర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో నిన్న జరిగిన ఎన్‌కౌంటర్ లో మావోయిస్టు డిప్యూటీ కమాండర్ జోగా హతమైనట్టు ఎస్పీ దీపక్‌ఝా తెలిపారు. దర్బా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలంగనార్ అటవీ ప్రాంతంలో కట్టేకళ్యాణ్-కంగదర్ గట్టీ ఏరియా కమిటీకి చెందిన కొందరు మావోయిస్టులు సమావేశం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన డీఆర్జీ, సీఆర్‌పీఎఫ్ దళాలు మావోయిస్టుల కోసం జల్లెడ పట్టాయి.

ఈ క్రమంలో అర్ధరాత్రి సమయంలో ఇరువర్గాలు తారసపడ్డాయి. దీంతో ఇరు వర్గాల మధ్య దాదాపు 45 నిమిషాలపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు పీఎల్‌జీఏ ప్లాటూన్ నంబరు 26 కట్టే కల్యాణ్ ఏరియా డిప్యూటీ కమాండర్ జోగా (30) ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారు తప్పించుకున్నట్టు ఎస్పీ తెలిపారు.

More Telugu News