West Bengal: పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ పిటిషన్.. విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు!

Suprem Court Seeks asks Center on President Rule in West Bengal
  • మే 2న వెల్లడైన ఎన్నికల ఫలితాలు
  • ఆ తరువాత పెరిగిన హింస
  • ఈసీ, బెంగాల్ సర్కార్ కు కూడా నోటీసులు
పశ్చిమ బెంగాల్ లో ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసను దృష్టిలో పెట్టుకుని, ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను విచారించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అనంతరం ఈ విషయంలో కేంద్రానికి, రాష్ట్రానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

ఎన్నికల తరువాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, మే నెల 2వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి పరిస్థితి క్షీణించిందని పిటిషన్లు దాఖలయ్యాయి. బెంగాల్ కు సైన్యాన్ని, పారా మిలిటరీ దళాలను తరలించాలని, పరిపాలనను సాధారణ స్థితికి తీసుకుని వచ్చి, ప్రజల్లో నమ్మకాన్ని పెంచడంతో పాటు, అంతర్గత భద్రతపై దృష్టిని సారించి, జరిగిన హింసపై ప్రత్యేక విచారణ బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు కాగా, ధర్మాసనం విచారించింది.

ఈ పిటిషన్ ను జస్టిస్ వినీత్ శరన్, దినోష్ మహేశ్వరి విచారణకు స్వీకరించారు. ఎన్నికల తరువాత జరిగిన ఘర్షణల్లో నష్టపోయిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయంలో కూడా మమతా బెనర్జీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. ఈ పిటిషన్ ను రంజానా అగ్నిహోత్రి అనే యూపీ ప్రాక్టీస్ న్యాయవాదితో పాటు సామాజిక కార్యకర్త జితీందర్ సింగ్ దాఖలు చేయగా, వారి తరఫున న్యాయవాది హరి శంకర్ జైన్ వాదనలు వినిపించారు. ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీకి మాత్రం వ్యక్తిగతంగా నోటీసులను ఇవ్వలేదు.
West Bengal
President Rule
Supreme Court
PIL

More Telugu News