ఓటీటీ దిశగా నిఖిల్ '18 పేజెస్'
- విడుదలకి సిద్ధమైన '18 పేజెస్'
- నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్
- సుకుమార్ అందించిన కథపై ఆసక్తి
- అనుపమ ఆశలు ఈ సినిమాపైనే
ఈ సినిమా కూడా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. థియేటర్లు ఓపెన్ అయినా, లైన్లో చాలానే సినిమాలు ఉన్నాయి. అందువలన ఈ సినిమాను ఓటీటీ వైపు తీసుకెళదామనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో అనుపమ జోరు కాస్త తగ్గింది. అందువలన ఆమె ఈ సినిమాపై ఆశలుపెట్టుకుంది. '18 పేజెస్' తరువాత 'కార్తికేయ 2' ను పూర్తిచేయాలనే ఆలోచనలో నిఖిల్ ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ షూటింగును జరుపుకుంది.