C Kalyan: సినీ నిర్మాత సి.కల్యాణ్ కు సుప్రీంకోర్టు నోటీసులు!

  • హఫీజ్ పేట భూముల కేసులో విచారణ
  • ఫైనల్ డిక్రీ లేకుండా నిర్మాణాలేంటని ప్రశ్న
  • సమాధానం చెప్పాలని నోటీసులు
Supreem Court Notices Telangana Govt and Producer C Kalyan

తెలుగు చిత్ర నిర్మాత సి.కల్యాణ్ తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి హఫీజ్ పేట భూముల కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన రూలింగ్ సహేతుకంగా లేదని, ఫైనల్ డిక్రీ కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసు వివరాల్లోకి వెళితే, హైదరాబాదు శివారు హఫీజ్ పేటలోని సర్వే నంబర్ 80లో కొంత భూమి తనదని సి.కల్యాణ్ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన ఆ భూముల్లో నిర్మాణాలు చేపట్టారు.

ఈ తీర్పును సవాల్ చేస్తూ హమీదున్నీసా బేగం, సెహెబ్బాదీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుధవారం నాడు ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, నవీన్ సిన్హాలతో కూడిన ధర్మాసనం, ఫైనల్ డిక్రీ పొందకుండా కట్టడాలు ఎలా కడతారని ప్రశ్నించింది. కల్యాణ్ తరఫున న్యాయవాది శ్రీధర్ వాదనలు వినిపిస్తూ, ఫైనల్ డిక్రీ వచ్చిందని చెప్పారు.

దీనిపై అసహనాన్ని వ్యక్తం చేసిన ధర్మాసనం, ఫైనల్ డిక్రీ ఇవ్వలేదని హైకోర్టు తీర్పులో స్పష్టంగా ఉందని గుర్తు చేసింది. ఈ విషయంలో స్పందించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వానికి, కల్యాణ్ కు నోటీసులు జారీ చేసింది.

More Telugu News