Curfew: ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ ఆంక్షల సడలింపు

  • 4 జిల్లాల్లో సాయంత్రం 6 గంటల వరకు సడలింపు
  • 9 జిల్లాల్లో రాత్రి 9 గంటల వరకు సడలింపు
  • పాజిటివిటీ శాతం ఆధారంగా నిర్ణయం
  • జులై 7 వరకు కర్ఫ్యూ పొడిగింపు
Curfew will be relaxed in some districts in AP

ఏపీలో కరోనా పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్న జిల్లాల్లో రేపటి నుంచి కర్ఫ్యూ ఆంక్షలు సడలిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కొన్నిరోజుల కిందటే వెల్లడించగా, నేడు జీవో జారీ చేసింది. కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజా కార్యకలాపాలకు అనుమతినిచ్చారు. రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది.

తాజా జీవో ప్రకారం... కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ప్రజా కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకు ఈ నాలుగు జిల్లాల్లో కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. ఇక మిగిలిన 9 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు కర్ఫ్యూ సడలించారు.

కాగా, ఏపీ ప్రభుత్వం గతంలో విధించిన కర్ఫ్యూ నేటితో ముగియనుంది. దాంతో జులై 7 వరకు కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు తాజా జీవోలో పేర్కొన్నారు. పలు జిల్లాల్లో ఆంక్షల సడలింపులు కూడా అప్పటివరకు వర్తిస్తాయి.

More Telugu News