ఏపీలో గత 24 గంటల్లో 3,797 కరోనా కేసుల నమోదు
- తూర్పుగోదావరి జిల్లాలో 874 కేసులు
- అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 105 కేసులు
- రాష్ట్రంలో 35 మంది మృతి
- ఇంకా 38,338 మందికి చికిత్స
అదే సమయంలో 5,498 మంది కరోనా నుంచి కోలుకోగా, 35 మంది మృతి చెందారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 8 మంది కరోనాతో కన్నుమూశారు. చిత్తూరు జిల్లాలో ఏడుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 12,706 మంది కరోనాతో మృతి చెందారు. ఏపీలో ఇప్పటిదాకా 18,89,513 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,38,469 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 38,338 మందికి చికిత్స జరుగుతోంది.