Rana Daggubati: బిగ్ బాస్ సీజన్ 5 హోస్టుగా రానా?

Rana is Host in Bigg Boss season 5
  • 'బిగ్ బాస్' రియాలిటీ షోకి మంచి ఆదరణ
  • 5వ సీజన్ కి మొదలైన సన్నాహాలు
  • సెప్టెంబర్ 5వ తేదీ నుంచి మొదలు  
  • రానాతో కొనసాగుతున్న సంప్రదింపులు

తెలుగులో ఇంతవరకూ 'బిగ్ బాస్' నాలుగు సీజన్లను పూర్తిచేసుకుంది. 5వ సీజన్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే అందుకు సంబంధించిన ప్రయత్నాలకు కరోనా కారణంగా అవరోధం ఏర్పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో, ఈ రియాలిటీ షోకి సంబంధించిన సన్నాహాలు మొదలైనట్టుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 'బిగ్ బాస్ 5'కి హోస్టుగా ఎవరు వ్యవహరించనున్నారు? అనే ప్రశ్నకి సమాధానంగా 'రానా' పేరు వినిపిస్తోంది.

'బిగ్ బాస్ 1'కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తరువాత నాని సందడి చేశాడు. 3 .. 4 సీజన్లను నాగార్జున నడిపించారు. ఇక ఇప్పుడు తెరపైకి 'రానా' పేరు వచ్చింది. రానాకి యూత్ లో మంచి క్రేజ్ ఉంది .. యాంకర్ గా ఆయనకి అనుభవం ఉంది. ఒక షోను నిర్వహించడానికి అవసరమైన సమయస్ఫూర్తి కూడా ఉంది. అందువలన ఆయనను సంప్రదిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. రానా డేట్లు సర్దుబాటు అయితే ఆయన చేసే అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ రియాలిటీ షో మొదలవుతుందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News