Sasikala: శశికళపై మరో కేసు... ఎఫ్ఐఆర్ ను రిజిస్టర్ చేసిన పోలీసులు!

  • న్యాయ శాఖ మంత్రిని బెదిరించినట్టు ఆరోపణలు
  • విచారించి కేసు రిజిస్టర్ చేసిన విల్లుపురం పోలీసులు
  • ఐపీసీ, ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు
VillupuramPolice Register FIR on Sasikala

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళపై మరో కేసు నమోదైంది. అన్నా డీఎంకే నేతను చంపేస్తానని బెదిరించాన్న ఫిర్యాదులు రాగా, పోలీసులు ఎఫ్ఐఆర్ ను రిజిస్టర్ చేశారు. అన్నాడీఎంకే నేత, న్యాయ శాఖ మాజీ మంత్రి సీవీ షణ్ముగం ఈ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై విచారించిన విల్లుపురం జిల్లా పోలీసులు ఐపీసీలోని 506 (1), 507, 109, ఐటీ చట్టం 2000లోని 67 సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు.

కాగా, కొన్నేళ్ల క్రితం అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ, జైలు శిక్ష తరువాత, ఇప్పుడు మళ్లీ పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దిశగా కొందరు నేతలు, కార్యకర్తల మద్దతును కూడా ఆమె కూడగట్టుకున్నారు. అన్నాడీఎంకేపై కోల్పోయిన పట్టును తిరిగి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. జైలు నుంచి వచ్చిన తరువాత జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న ఆమె, తన కారణంగా పార్టీ చీలడం ఇష్టం లేదని అప్పట్లో అన్నారు. ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోరంగా ఓటమి చెందగా, ఇప్పుడు పార్టీని తన చేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలను ప్రారంభించారు.

More Telugu News