Sachin Tendulkar: 14 ఏళ్ల క్రితం ఇదే రోజున చరిత్ర సృష్టించిన సచిన్ టెండూల్కర్

  • 14 ఏళ్ల క్రితం ఇదే రోజున 15 వేల పరుగుల మైలు రాయిని దాటిన సచిన్
  • సౌతాఫ్రికాతో జరిగిన వన్డేలో 93 పరుగులు సాధించిన మాస్టర్ బ్లాస్టర్
  • వన్డేల్లో 49 సెంచరీలు సాధించిన సచిన్
Sachin Tendulkar became 1st man to score 15000 runs

ప్రపంచంలో ఎందరో క్రికెట్ దిగ్గజాలు ఉన్నప్పటికీ, క్రికెట్ దేవుడిగా వినుతికెక్కిన ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మాత్రమే. ఎందరో క్రికెట్ దిగ్గజాలు సచిన్ ను క్రికెట్ దేవుడిగా కీర్తించారు. సచిన్ కు ఈరోజు ఎంతో గుర్తిండిపోయే రోజు. సరిగ్గా 14 ఏళ్ల క్రితం సచిన్ వన్దేల్లో 15 వేల పరుగులను సాధించి, చరిత్ర పుటల్లో నిలిచాడు. వన్డేల్లో 15 వేల పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్ మెన్ గా తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.

బెల్ ఫాస్ట్ లో సౌతాఫ్రికాతో జరిగిన రెండో ఓడీఐలో సచిన్ ఈ ఘనతను సాధించాడు. 227 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సచిన్ 106 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. ఈ సందర్భంగా 15 వేల మైలు రాయిని దాటాడు. ఈ ఇన్నింగ్స్ లో సచిన్ 13 ఫోర్లు, రెండు సిక్సర్లను బాదాడు. 93 పరుగులు చేసిన సచిన్ 32వ ఓవర్ లో ఔటయ్యాడు. అయినప్పటికీ ఆ మ్యాచ్ లో ఇండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇన్నింగ్స్ చివరలో యువరాజ్ సింగ్, దినేశ్ కార్తీక్ అద్భుతంగా ఆడి భారత్ కు విజయాన్ని అందించారు.

సచిన్ తన వన్డే కెరీర్లో 18,426 పరుగులు సాధించాడు. 49 సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన తన కోరీర్లో సచిన్ ఆరు ప్రపంచకప్ లకు ప్రాతినిధ్యం వహించాడు. 2011లో భారత్ కు ప్రపంచకప్ ను అందించాడు. భారత్ క్రికెట్ కు సచిన్ చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. భారతరత్న పురస్కారాన్ని అందుకున్న ఏకైక క్రీడాకారుడు సచిన్ మాత్రమే కావడం గమనార్హం.

More Telugu News