Komatireddy Venkat Reddy: అపోలో ఆసుపత్రిలో వీహెచ్ ను పరామర్శించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komatireddy Venkat Reddy visits VH at Apollo Hospital in Hyderabad
  • కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వీహెచ్
  • హైదరాబాదులో చికిత్స
  • వీహెచ్ ఆరోగ్యపరిస్థితి తెలుసుకున్న కోమటిరెడ్డి
  • త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కిడ్నీ సమస్యతో బాధపడుతూ హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఆయనను కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. అపోలో ఆసుపత్రికి వెళ్లిన కోమటిరెడ్డి వీహెచ్ తో మాట్లాడారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగారు. ఈ విషయాన్ని కోమటిరెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వీహెచ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. తాను అపోలో ఆసుపత్రికి వెళ్లినప్పటి ఫొటోలను కూడా కోమటిరెడ్డి పంచుకున్నారు.

కాగా, రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో వీహెచ్ ముందువరుసలో ఉంటారు. రేవంత్ కు పీసీసీ పదవి ఇచ్చిన వెంటనే వీహెచ్ ఆసుపత్రిలో చేరారు. మరోవైపు, కోమటిరెడ్డి కూడా తనకు పీసీసీ రాకపోవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉండడం తెలిసిందే.
Komatireddy Venkat Reddy
VH
Apollo Hospital
Hyderabad
Congress

More Telugu News