YSRCP: వైఎస్‌ను తిడుతున్నా జగన్, విజయసాయిరెడ్డి అందుకే నోరు విప్పడం లేదు: మాజీ మంత్రి బండారు

Bandaru satyanarayan murthy fires on jagan and vijayasai
  • వైసీపీ నేతలు టీఆర్ఎస్‌తో కుమ్మక్కు
  • కేసుల మాఫీ కోసం కేంద్రానికి అమ్ముడుపోయారు
  • కేసీఆర్‌ను చూసి భయపడుతున్నారు
తెలంగాణ మంత్రులందరూ మూకుమ్మడిగా వైఎస్ రాజశేఖరరెడ్డిని తిడుతుంటే ఆయన కుమారుడైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి ఎందుకు పెదవి విప్పడం లేదని టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసమే వీరు ఖండించడం లేదని, కేంద్రానికి ఈ ఇద్దరు నేతలు అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతలందరూ టీఆర్ఎస్‌తో కుమ్మక్కు అయిపోయారని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి వీరందరూ భయపడుతున్నారని అన్నారు. అందుకే వైఎస్‌ను తిడుతున్నా ఏ ఒక్కరూ ఖండించకుండా మౌనం వహిస్తున్నారని విమర్శించారు.

YSRCP
TRS
Jagan
Vijay Sai Reddy
Bandaru Satyanarana Murthy

More Telugu News