Wimbledon: వింబుల్డన్ లో సంచలనాలు... తొలి రౌండ్ ను దాటని మూడో సీడ్ సిట్సిపాస్, మాజీ చాంప్ క్విటోవా!

World Fourth Seed Stacy pass Defeted in Wimbledon First Rount
  • 57వ ర్యాంకర్ చేతిలో ఓడిన సిట్సిపాస్
  • మూడు వరుస సెట్లలో ఓటమి
  • శుభారంభం చేసిన జకోవిచ్
  • క్విటోవాను ఓడించిన స్టోన్ స్టీఫెన్స్
లండన్ లో నిన్న ప్రారంభమైన వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పోటీల్లో తొలిరోజే సంచలనాలు నమోదయ్యాయి. అనామకుడి చేతిలో ప్రపంచ నాలుగో సీడ్, వింబుల్డన్ లో మూడవ సీడ్ గా బరిలోకి దిగిన సిట్సిపాస్ ఓటమి పాలు కాగా, మాజీ చాంపియన్ క్విటోవా సైతం ఓడిపోయింది. వరల్డ్ 57వ ర్యాంకర్ అయిన అమెరికాకు చెందిన ఫ్రాన్సెస్ టియాఫో, సిట్సిపాస్ ను వరుస సెట్లలో ఓడించాడు.

టియాఫో టాప్ క్రీడాకారుడిపై నెగ్గడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గత రాత్రి జరిగిన మ్యాచ్ లో 6-4, 6-4, 6-3 తేడాతో టియాఫో విజయం సాధించాడు. ఈ మ్యాచ్ లో టియాఫో ఒక్క సెట్ ను కూడా కోల్పోకపోవడం గమనార్హం. ఇదే సమయంలో సిట్సిపాస్ సర్వీస్ ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు.

ఇక మరో మ్యాచ్ లో టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్, సెర్బియాకు చెందిన జకోవిచ్ శుభారంభం చేయగా, ఐదో సీడ్ రుబ్లెవ్, అర్జెంటీనాకు చెందిన డెల్ బోనిస్ పై విజయం సాధించాడు.

కాగా, మహిళల సింగిల్స్ లో భాగంగా జరిగిన మరో మ్యాచ్ లో 2011, 2014లో చాంపియన్ గా నిలిచిన చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి పెట్రా క్విటోవాను 73వ ర్యాంకర్, అమెరికాకు చెందిన స్లోన్ స్టీఫెన్స్ ఓడించింది. ఈ మ్యాచ్ లో స్లోన్ 6-3, 6-5 తేడాతో క్విటోవాపై విజయం సాధించింది. తొలి సెట్ ను ఘోరంగా వదిలేసుకున్న క్విటోవా, రెండో సెట్ లోనూ ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోవడం గమనార్హం.
Wimbledon
Sitsipass
Kwitowa
Defete

More Telugu News