Nayanthara: త్వరలోనే నయనతారను పెళ్లి చేసుకుంటా: విఘ్నేశ్ శివన్

Will marry Nayanathara soon says Vignesh Shivan
  • నయన్ తో గడిపే ప్రతి క్షణం నాకు నచ్చుతుంది
  • పెళ్లి కోసం డబ్బులు దాచి పెడుతున్నా
  • నయన్ చేసే చికెన్ కర్రీ, ఘీ రైస్ నాకు చాలా ఇష్టం
దక్షిణాది సినీ పరిశ్రమలో గత కొంత కాలంగా స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ ల ప్రేమాయణం హాట్ టాపిక్ గా కొనసాగుతోంది. వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విఘ్నేశ్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నయన్ ను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

చీరలో నయర్ చాలా అందంగా ఉంటుందని.. ఆమెకు చీర బాగా సెట్ అవుతుందని తెలిపాడు. చీరలో ఉన్న నయన్ తనకు చాలా ఇష్టమని చెప్పాడు. నయన్ తో గడిపే ప్రతి క్షణం, ప్రతి ప్రదేశం తనకు ఎంతో నచ్చుతాయని తెలిపాడు. పెళ్లి చేసుకోవడం ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని... అందుకే, పెళ్లి కోసం ప్రస్తుతం తాను డబ్బు దాచి పెడుతున్నానని శివన్ చెప్పాడు. కరోనా పరిస్థితులు చక్కబడిన వెంటనే పెళ్లి చేసుకుంటామని వెల్లడించాడు.

ఇక ప్రతి రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత తిన్న గిన్నెలన్నింటినీ నయనే శుభ్రం చేస్తుందని చెప్పాడు. నయన్ చేసే చికెన్ కర్రీ, ఘీ రైస్ తనకు ఎంతో ఇష్టమని అన్నాడు. నయనతార నటించిన చిత్రాల్లో 'రాజు రాణి' తనకు చాలా ఇష్టమని చెప్పాడు.

రజనీకాంత్ అంటే తనకు ఎంతో ఇష్టమని శివన్ తెలిపాడు. తాను దర్శకుడిగా ఈరోజు మీ ముందు ఉన్నానంటే దానికి ఆయనే ప్రేరణ అని చెప్పాడు. భవిష్యత్తులో అవకాశం వస్తే రజనీ సార్ తో సినిమా చేయాలనే కోరిక ఉందని అన్నాడు. ఆయన ఓకే చెపితే ఫుల్ జోష్ తో ఉండే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీస్తానని చెప్పాడు.
Nayanthara
Vighesh Shivan
Tollywood
Kollywood
Marriage

More Telugu News