YS Sharmila: రాజన్న బిడ్డగా చెబుతున్నా... తెలంగాణకు దక్కాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం: షర్మిల

YS Sharmila responds on Telugu states water disputes
  • తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టు వార్
  • స్పందించిన షర్మిల
  • తనపై కొందరు సందేహిస్తున్నారని వెల్లడి
  • తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టీకరణ
తెలుగు రాష్ట్రాల జలవివాదంలో వైఎస్ షర్మిల స్పందించారు. తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. "ఈమె తెలంగాణ కోసం నిలబడుతుందా? ఈమె తెలంగాణ కోసం పోరాడుతుందా? తెలంగాణకు అన్యాయం జరిగే ప్రాజెక్టులను అడ్డుకుంటుందా? అని చాలామంది అనుకుంటుండొచ్చు. మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెబుతున్నా... తెలంగాణకు దక్కాల్సిన ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం. తెలంగాణకు అన్యాయం జరిగే ఏ ప్రాజెక్టునైనా, ఏ పనినైనా నేను అడ్డుకుంటా. తెలంగాణ ప్రజల కోసం నిలబడతా. తెలంగాణ ప్రజల కోసం ఎవరితోనైనా కొట్లాడతా" అని షర్మిల వ్యాఖ్యానించారు.
YS Sharmila
YSR
Water Disputes
Telangana
Andhra Pradesh

More Telugu News