Andhra Pradesh: పరిశుభ్రత, నాణ్యతలో మేటి.. శ్రీకాళహస్తి ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు

srikalahasti temple got ISO certificate
  • ఆలయానికి ప్రత్యేక గుర్తింపు
  • అన్నదానం పథకంలో నాణ్యత, అతిథి గృహాల నిర్వహణలో శుభ్రత
  • ధ్రువీకరణ పత్రాన్ని అందజేసిన ప్రతినిధులు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. పరిశుభ్రత, నాణ్యత విషయంలో మేటిగా నిలిచినందుకు ఈ గుర్తింపు దక్కింది. హెచ్‌వైఎం సంస్థ ప్రతినిధి శివయ్య, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి కలిసి ఆలయ ఈవో పెద్దిరాజుకు నిన్న ఆలయ ఆవరణలో ఐఎస్ఓ ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా హెచ్‌వైఎం ప్రతినిధి శివయ్య మాట్లాడుతూ.. ఆలయంలో నిర్వహించే అన్నదాన పథకంలో నాణ్యతకు, అతిథి గృహాల నిర్వహణలో శుభ్రతను పరిశీలించిన అనంతరం ఐఎస్ఓ ధ్రువీకరణ పత్రం అందించినట్టు చెప్పారు. శ్రీకాళహస్తీశ్వరుని ఆలయానికి ఐఎస్ఓ గుర్తింపు లభించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Andhra Pradesh
Chittoor District
Srikalahasti Temple
ISO

More Telugu News