హుజూరాబాద్ లోని 45 వేల ఓట్ల కోసమే నేటి అఖిలపక్ష సమావేశం: సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ వివేక్ విమర్శలు

27-06-2021 Sun 15:16
  • దళితుల అంశంపై కేసీఆర్ అఖిలపక్ష సమావేశం
  • కేసీఆర్ దళిత ద్రోహి అంటూ వివేక్ వ్యాఖ్యలు
  • ఎన్నికలప్పుడే దళితులు గుర్తొస్తారని వెల్లడి
  • కేసీఆర్ కు దళితులు బుద్ధి చెబుతారని స్పష్టీకరణ
Former MP Vivek slams CM KCR

దళితుల అంశంపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ నేడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ వివేక్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని, ఎన్నికలప్పుడే ఆయనకు దళితులు గుర్తొస్తారని మండిపడ్డారు.

హుజూరాబాద్ లో ఉన్న 45 వేల ఓట్ల కోసమే కేసీఆర్ అఖిలపక్షం నిర్వహిస్తున్నాడని ఆరోపించారు. అక్రమ మార్గంలో కేటీఆర్ ను సీఎం చేయాలనుకుంటున్నారని వివేక్ తెలిపారు. కేసీఆర్ కు దళితులు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు.