Alla Nani: ఏలూరు ఆశ్రమం ఆసుపత్రిలో రోగి మృతిపై విచారణకు ఆదేశించిన మంత్రి ఆళ్ల నాని

Alla Nani orders a probe into patient death in Eluru Ashram Hospital
  • కొవిడ్ తో ఆసుపత్రిలో చేరిన రోగి
  • నెల రోజులకు పైగా చికిత్స
  • మృతి చెందిన రోగి
  • తీవ్ర ఆరోపణలు చేసిన బంధువులు
ఏలూరు ఆశ్రమం ఆసుపత్రిలో రోగి మృతి చెందగా, రోగి బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తుండడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని స్పందించారు. ఆశ్రమం ఆసుపత్రిలో రోగి మృతి చెందడంపై విచారణకు ఆదేశించారు. కాగా, ఏలూరు ఆశ్రమం ఆసుపత్రిలో సదరు రోగి కొవిడ్ తో బాధపడుతూ చేరాడు. రోగికి నెల రోజుల పాటు కొవిడ్ చికిత్స అందించారు. అయినప్పటికీ మరణించడంతో బంధువులు ఆసుపత్రి వర్గాలపై మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో, మంత్రి ఆళ్ల నాని డీఎం అండ్ హెచ్ఓ, ఆశ్రమం ఆసుపత్రి డాక్టర్ తో మాట్లాడారు. రోగి ఊపిరితిత్తులు పూర్తిగా పాడైపోయాయని వారు మంత్రికి తెలియజేశారు. మృతుడి బంధువుల ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని మంత్రి అధికారులకు స్పష్టం చేశారు. రోగి మృతి విషయంలో ఆశ్రమం ఆసుపత్రి నిర్లక్ష్యం ఉందని తేలితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Alla Nani
Ashram Hospital
Eluru
Patient
Death
Probe
Covid

More Telugu News