తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం
- ఎట్టకేలకు నిర్ణయం ప్రకటించిన కాంగ్రెస్
- తెలంగాణ కాంగ్రెస్ సారథిగా రేవంత్ రెడ్డి
- కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఐదుగురికి అవకాశం
- జగ్గారెడ్డి, అజర్, గీతారెడ్డిలకు చాన్స్
ఇక, ఇదే క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా ఐదుగురిని నియమించింది. జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, మహేశ్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ లను కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ ఓ ప్రకటనలో పేర్కొంది.
పీసీసీ ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్, దామోదర్ రెడ్డి, మల్లు రవి, పోదెం వీరయ్య, సురేశ్, వేం నరేందర్ రెడ్డి, రమేశ్ ముదిరాజ్ లను నియమించింది. తెలంగాణ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలపై ఇన్నాళ్లుగా నాన్చిన కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టకేలకు నిర్ణయాన్ని ప్రకటించి అనిశ్చితికి తెరదించింది.