ప్రస్తుత 'మా' కార్యవర్గంలో ఉన్న సభ్యులు మరో ప్యానెల్ లో చేరడం తప్పు: కరాటే కల్యాణి

26-06-2021 Sat 14:31
  • త్వరలో మా ఎన్నికలు
  • నిన్న తన ప్యానెల్ ను ప్రదర్శించిన ప్రకాశ్ రాజ్
  • అందులోని వారు కొందరు ప్రస్తుతం 'మా'లో సభ్యులన్న కల్యాణి
  • వారిని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్
Karate Kalyani comments on MAA Elections
టాలీవుడ్ లో మా ఎన్నికల వేడి మరింత రాజుకుంది. ప్రస్తుత 'మా' కార్యవర్గంలో సభ్యురాలైన కరాటే కల్యాణి తాజా పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 'మా' కార్యవర్గంలో సభ్యులుగా ఉన్న కొందరు, ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో కనిపించారని వెల్లడించారు. 'మా' కార్యవర్గం నడుస్తుండగానే, వారు మరో ప్యానెల్ లో చేరడం సరికాదని విమర్శించారు. ఒక కమిటీ కొనసాగుతున్న సమయంలో మరో ప్యానెల్ లో చేరిన సభ్యులును సస్పెండ్ చేయాలని కరాటే కల్యాణి డిమాండ్ చేశారు.

'మా' మసకబారిపోయిందంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని, అది తప్పు అని స్పష్టం చేశారు. కరోనా కాలంలో 'మా' ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని, కళాకారులకు నిరంతరం సేవలు అందిస్తూనే ఉన్నామని వెల్లడించారు. 'మా' అధ్యక్ష పదవికి పోటీపడుతున్న నటుడు ప్రకాశ్ రాజ్ నిన్న తన ప్యానెల్ లో పోటీ చేసేవారిని మీడియా ముందుకు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.