Prime Minister: అయోధ్య నగరం అందరిదీ: ప్రధాని నరేంద్ర మోదీ

  • పనుల పురోగతిపై యూపీ సీఎంతో చర్చ
  • ఆధ్యాత్మికతతో పాటు అందం ఉట్టిపడాలని సూచన
  • మన సంస్కృతి కనిపించాలన్న ప్రధాని
Ayodhya A city is by every one for every indian says pm Modi

మన సంస్కృతీ సంప్రదాయాలు, మనం చేసే అభివృద్ధి ఫలాలు అయోధ్య నగర నిర్మాణంలో కనిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇవ్వాళ ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయోధ్య నిర్మాణ పనుల్లో పురోగతిపై చర్చించారు. మంచి రోడ్లు, మౌలిక వసతులు, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ వంటి సకల హంగులతో నగరాన్ని నిర్మిస్తున్నట్టు ప్రధానికి యోగి వివరించారు.

‘‘ప్రతి భారతీయుడి సాంస్కృతిక కల అయోధ్య. దానికి తగ్గట్టే నిర్మాణముండాలి. అయోధ్య నగరంలో ఆధ్యాత్మికతతో పాటు అందం కూడా ఉట్టిపడాలి. భావి తరపు మౌలిక వసతులకు అనుగుణంగా మానవ విలువలూ ఉండాలి’’ అని ప్రధాని అన్నట్టు అధికారులు చెబుతున్నారు. అయోధ్య నగరం ప్రతి ఒక్కరు నిర్మిస్తున్న ప్రతి ఒక్కరి నగరం అన్నారు.

More Telugu News