కేసీఆర్‌ను విమర్శించేందుకు నోరెలా వచ్చింది?: ఈటలపై బాల్క సుమన్ మండిపాటు

25-06-2021 Fri 10:18
  • హుజూరాబాద్‌ల్ లో బాల్క సుమన్ బైక్ ర్యాలీ
  • టీఆర్ఎస్‌లోనే ఈటల ఎదిగారన్న సుమన్
  • కేంద్రం టీకాలను అమ్ముకుందని ఆరోపణ
Balka Suman Fires on Etela Rajender

టీఆర్ఎస్ నేత, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నిన్న హుజూరాబాద్‌లో యువకులు, విద్యార్థి నాయకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈటల రాజేందర్‌పై విమర్శలు చేశారు.

కేసీఆర్‌పై ఈటల చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. తండ్రిలాంటి కేసీఆర్‌ను విమర్శించేందుకు ఈటలకు నోరెలా వచ్చిందని ప్రశ్నించారు. తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీలో ఈటల అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. ఏడేళ్లుగా తెలంగాణకు ఏమీ చేయని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడేదో చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో టీకాలు ఇవ్వకుండా అమ్ముకుందని బాల్క సుమన్ ఆరోపించారు.