మావోయిస్టు నేత హరిభూషణ్‌ను గుర్తుచేసుకుని కన్నీరు పెట్టుకున్న సీతక్క

25-06-2021 Fri 06:26
  • మహబూబాబాద్ జిల్లాలోని హరిభూషణ్ ఇంటికి వెళ్లి పరామర్శ
  • సీతక్కను పట్టుకుని రోదించిన కుటుంబ సభ్యులు
  • హరిభూషణ్ ప్రజల మనిషి అని కొనియాడిన ఎమ్మెల్యే
Mulugu MLA Seethakka met maoist Haribhushan family

మావోయిస్టు నేత హరిభూషణ్ మరణ వార్తతో ములుగు ఎమ్మెల్యే సీతక్క శోకసంద్రంలో మునిగిపోయారు. నిన్న మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెంలోని హరిభూషణ్ ఇంటికి వెళ్లిన సీతక్క ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీతక్కను చూసిన ఆయన కుటుంబ సభ్యులు రోదించడంతో ఆమె కూడా కన్నీరుపెట్టుకున్నారు. వారిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హరిభూషణ్ మృతి బాధాకరమని అన్నారు. ఆయన ప్రజల మనిషి అని కొనియాడారు. పాకాల కొత్తగూడ ప్రాంతంలో హరిభూషణ్ టీం లీడర్‌గా ఉన్నప్పుడు తాను కూడా ఆ ప్రాంత ప్రజల హక్కుల కోసం పని చేశానని సీతక్క గుర్తు చేసుకున్నారు.