'నాని ఏడిపించేశాడు..' అంటున్న షాహిద్ కపూర్!

24-06-2021 Thu 10:53
  • 'జెర్సీ' సినిమా చూశాను
  • నాని నటన నాకు నచ్చింది
  • మంచి కథాబలమున్న సినిమా ఇది
  • దీపావళికి హిందీ రీమేక్ రిలీజ్ చేయవచ్చు  
Shaid kapoor appreciated Nani acting in Jersey movie

నాని కథానాయకుడిగా తెలుగులో 'జెర్సీ' వచ్చిన సంగతి తెలిసిందే. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు నటన పరంగా నానీకి ప్రశంసలను తెచ్చిపెట్టింది. దర్శకుడిగా ఈ సినిమాతో పరిచయమైన గౌతమ్ తిన్ననూరికి కూడా మంచి ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. దాంతో ఆయన ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేశాడు. కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది.

తాజాగా ఇన్ స్టా లైవ్ లో ఈ సినిమాను గురించి షాహిద్ కపూర్ మాట్లాడాడు. "నాని చేసిన 'జెర్సీ' సినిమాను నేను చూశాను. నాని నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమా చూస్తున్నప్పుడు నాలుగైదు చోట్ల ఆయన నన్ను ఏడిపించేశాడు. కథాకథనాలు కూడా నాకు చాలా బాగా నచ్చాయి. అంతకుముందు అసలు కథే లేని సినిమాలు నేను చాలానే చేశాను. ఎలాంటి కథలను ఎంచుకోవాలనేది నాకు ఈ సినిమా చూసిన తరువాతనే అర్థమైంది. హిందీ రీమేక్ దీపావళికి విడుదల కావొచ్చు" అని ఆయన చెప్పాడు.