Medaram Jatara: మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలంటూ తెలంగాణ మంత్రుల వినతి

  • కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్‌ను కలిసిన మంత్రులు, ఎమ్మెల్సీల బృందం
  • రామప్ప ఆలయాన్ని వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చాలని వినతి
  • మేడారం జాతరకు నిధులు ఇవ్వాలని కోరిన బృందం
Telangana ministers request that Medaram Jatara be recognized as a national festival

ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని తెలంగాణ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత, బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి  శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌కు వినతిపత్రం సమర్పించారు. నిన్న ఢిల్లీ వెళ్లిన వీరంతా మంత్రిని కలిసి విన్నవించారు.

ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తించేందుకు చొరవ చూపాలని కోరారు.  ఈ సందర్భంగా చారిత్రక సంపదను చాటే రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చేందుకు అవసరమైన  పూర్తి సమాచారాన్ని అందజేసింది. అలాగే, రెండేళ్ల కోసారి జరిగే మేడారం జాతరకు ప్రభుత్వం రూ. 200 కోట్లు వెచ్చిస్తోందని, కేంద్రం నుంచి కూడా కొన్ని నిధులు ఇవ్వాలని మంత్రిని కోరారు.

More Telugu News