Bhadradri Kothagudem District: కొత్తగూడెంలో దారుణం: తనను తిట్టాడని చెవి, మర్మాంగాన్ని కోసేసిన వ్యక్తి!

Man cuts off opponents private parts during brawl
  • మద్యం మత్తులో బాధితుడు తిట్టడంతో ఘర్షణ
  • డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పిన నిందితుడు
  • చావుబతుకుల్లో బాధితుడు
తనను తిట్టడంతో తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి ప్రత్యర్థి చెవి, మర్మాంగాన్ని కోసేశాడు. ఆపై పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పొలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన రుద్రారపు కార్తీక్ తోపుడు బండిపై చిల్లర సామాన్లు విక్రయిస్తుంటాడు. ఐదు రోజుల క్రితం కొత్తగూడెం రుద్రంపూర్ ప్రాంతానికి వలస వచ్చి స్థానికంగా శిథిలమైన ఓ భవనంలో ఉంటున్నాడు.

అదే ప్రాంతంలో నివసిస్తున్న కూలీ హుస్సేన్ పాషా మంగళవారం మద్యం మత్తులో కార్తీక్‌ను దూషించాడు. ఇది ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. ఘర్షణ మరింత పెరగడంతో కోపంతో ఊగిపోయిన కార్తీక్.. పాషా చెవి, మర్మాంగాన్ని కత్తితో కోసేశాడు. ఆ తర్వాత ‘డయల్ 100’కు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
Bhadradri Kothagudem District
Crime News
Police

More Telugu News