ICC: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ విజేతగా కివీస్

Kiwis won first world test championship trophy
  • రెండేళ్లపాటు సాగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్
  • బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైన కోహ్లీ సేన
  • తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ విజేతగా విలియమ్సన్ సేన
రెండేళ్లపాటు సాగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో అద్భుత విజయాలు సాధించి ఫైనల్‌కు చేరుకున్న భారత జట్టు ఫైనల్ మెట్టు వద్ద బోల్తాపడింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలమైన కోహ్లీ సేన న్యూజిలాండ్‌కు టైటిల్ అప్పగించి రన్నరప్‌గా సరిపెట్టుకుంది. ఆట ప్రారంభం నుంచి అడ్డుకున్న వరుణుడు రిజర్వుడే నాడు ఆటంకం కలిగిస్తాడని, పరాజయాన్ని తప్పిస్తాడని భావించిన టీమిండియా అభిమానులకు నిరాశే ఎదురైంది.

నిన్న భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. దీంతో కివీస్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పోనూ ఆ జట్టు విజయ లక్ష్యం 139 పరుగులు అయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ 45.5 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఐసీసీ తొలి టెస్టు చాంపియన్‌షిప్ ట్రోఫీ అందుకుంది. కెప్టెన్ విలియమ్సన్ 52 పరుగులు, రాస్ టేలర్ 47 పరుగులు చేసి జట్టుకు అపురూప విజయాన్ని అందించారు.
ICC
WTC
India
Kiwis
Virat Kohli
Kane Williamson

More Telugu News