ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు..అప్ డేట్స్ ఇవిగో!

23-06-2021 Wed 17:53
  • 24 గంటల్లో 4,684 కరోనా పాజిటివ్ కేసులు
  • 36 మంది కరోనా వల్ల మృతి
  • రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 51,204
Corona cases in AP reducing

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 4,684 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తూర్పుగోదావరి జిల్లాలో 1,171 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 73 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇదే సమయంలో 36 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. 24 గంటల్లో 7,324 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలోని మొత్తం కేసుల సంఖ్య 18,62,036కి పెరిగింది. ఇప్పటి వరకు 17,98,380 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 51,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 12,452 మంది ప్రాణాలు కోల్పోయారు.