Hema: ‘మా’ అధ్యక్ష బరిలో సీనియ‌ర్ న‌టి హేమ

Hema to contest for MAA president
  • సెప్టెంబర్ లో జరగనున్న మా ఎన్నికలు
  • ఇప్పటికే బరిలో ప్రకాశ్ రాజ్, విష్ణు, జీవిత
  • తనను పోటీ చేయమని సినీ ప్రముఖులు ఒత్తిడి చేస్తున్నారన్న హేమ
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సెప్టెంబర్ నెలలో జరగనున్నాయి. ఇప్పటికే మా అధ్యక్ష పదవి బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్ నిలిచారు. తాజాగా మరో పోటీదారు పేరు తెరపైకి వచ్చింది. అధ్యక్ష పదవి కోసం తాను బరిలోకి దిగుతున్నట్టు సీనియర్ నటి హేమ తెలిపింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇప్పటికే ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా పదవులను చేపట్టానని చెప్పారు. ఈ సారి ట్రెజరర్ పదవికి పోటీ చేద్దామని అనుకున్నానని... అయితే ఆలోచనను మార్చుకున్నానని తెలిపారు.

ప్రకాశ్ రాజ్, విష్ణు, జీవితలు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారని తెలిసిందని... పెద్దల వివాదాల్లో మనమెందుకు చిక్కుకోవాలని తొలుత అనుకున్నానని హేమ అన్నారు. అసలు పోటీ చేయకూడదని భావించానని తెలిపారు. అయితే, సినీ ప్రముఖుల నుంచి ఒత్తిడి వస్తోందని... నువ్వెందుకు పోటీ చేయకూడదని ఫోన్లు చేసి అడుగుతున్నారని చెప్పారు.

నువ్వుంటే బాగుంటుందని.. అర్ధరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావని చెపుతున్నారని అన్నారు. గత ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు తనకు అండగా నిలిచిన వారికోసం... ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు.
Hema
MAA
Tollywood

More Telugu News