మార్కెట్ల ఊగిసలాట.. 282 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

23-06-2021 Wed 16:56
  • లాభాల స్వీకరణకు మొగ్గు చూసిన ఇన్వెస్టర్లు
  • 282 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 85 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
Sensex loses 282 points

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఊగిసలాట ధోరణిని ప్రదర్శించాయి. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 282 పాయింట్లు కోల్పోయి 52,306కి పడిపోయింది. నిప్టీ 85 పాయింట్లు నష్టపోయి 15,686కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకి (2.33%), టైటాన్ కంపెనీ (1.49%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.22%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.84%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.69%).

టాప్ లూజర్స్:
కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.32%), ఎల్ అండ్ టీ (-1.29%), టాటా స్టీల్ (-1.23%), టీసీఎస్ (-1.17%), ఐసీఐసీఐ బ్యాంక్ (-0.96%).