Mallu Bhatti Vikramarka: అప్పుడు మేం చెబితే పట్టించుకోలేదు.. ఇప్పుడు యుద్ధం చేస్తామంటున్నారు: కేసీఆర్‌పై భట్టి విక్రమార్క ఫైర్

Mallu Bhatti Vikramaka Fires on KCR
  • ఏపీ ప్రాజెక్టులపై ఏడాది క్రితమే హెచ్చరించాం
  • కేసీఆర్, మంత్రుల మాటలు హాస్యాస్పదం
  • నీటి కోసం సాధించుకున్న తెలంగాణలో కృష్ణా నది నుంచి నీరేదీ?
రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవకముందే తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెడచెవిన పెట్టారని, ఇప్పుడేమో రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు యుద్ధం చేస్తామని అంటున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు.

 ఏపీ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై టీఆర్ఎస్ ప్రభుత్వం, మంత్రులు ఏడాది తర్వాత నిద్ర లేచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు నీటి యుద్ధం చేస్తామని కేసీఆర్, మంత్రులు మాట్లాడుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సంగమేశ్వర ప్రాజెక్టు కోసం ఏపీ ప్రభుత్వం ఏడాది కిందటే జీవో జారీ చేసిందని భట్టి గుర్తు చేశారు. నీటి కోసం సాధించుకున్న తెలంగాణలో కృష్ణా నది నుంచి ఒక్క ఎకరానికి కూడా నీరు అందలేదని భట్టి పేర్కొన్నారు.
Mallu Bhatti Vikramarka
Congress
TRS
KCR
Andhra Pradesh

More Telugu News