Corona Virus: క‌రోనా చికిత్స, టెస్టులు, అంబులెన్సు ధ‌ర‌ల‌ను ఖ‌రారు చేసిన తెలంగాణ‌ ప్ర‌భుత్వం

corona tests rates fix
షార్ట్స్‌లో చూడండి
క‌రోనా చికిత్స, వైద్య ప‌రీక్ష‌లు, అంబులెన్సు చార్జీల‌కు గ‌రిష్ఠ ధ‌ర‌ల‌ను ఖ‌రారు చేస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు చార్జీల‌పై వైద్య ఆరోగ్య శాఖ‌ జీవో నంబ‌రు 40 జారీ చేసింది. ప్రైవేటు ఆసుప‌త్రుల్లో సాధార‌ణ వార్డులో ఐసోలేష‌న్, ప‌రీక్ష‌ల‌కు రోజుకు గ‌రిష్ఠంగా రూ.4 వేలు, ఐసీయూ వార్డులో గ‌రిష్ఠంగా రూ.7,500, వెంటిలేట‌ర్ తో కూడిన ఐసీయూ గ‌ది చికిత్స‌కు గ‌రిష్ఠంగా రూ.9 వేలు మాత్ర‌మే ఛార్జ్ చేయాలని ఆదేశించింది. పీపీఈ కిట్ ధ‌ర రూ.273 మించ‌రాద‌ని చెప్పింది.  

ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన ధ‌ర‌లు

సాధార‌ణ అంబులెన్సుకు క‌నీస చార్జీ రూ.2 వేలు
హెచ్ఆర్సీటీ-రూ.1,995
డిజిట‌ల్ ఎక్స్‌రే- రూ.1,300
డీ డైమ‌ర్ ప‌రీక్ష‌-రూ.300
సీఆర్పీ-రూ.500
ప్రొకాల్ సిటోనిన్-రూ.1,400
ఫెరిటిన్-రూ.400
ఎల్డీహెచ్‌-రూ.140
Go Back to Shorts
Corona Virus
COVID19
ambulance

More Telugu News