వచ్చేనెలలో పట్టాలపైకి రామ్ కొత్త ప్రాజెక్టు!

23-06-2021 Wed 11:49
  • రామ్ తాజా ప్రాజెక్టులో కదలిక
  • రెగ్యులర్ షూటింగుకు సన్నాహాలు
  • కథానాయికగా కృతి శెట్టి
Ram movie shooting starts from july

రామ్ ఇటీవల చేసిన 'రెడ్' సినిమా ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. అయినా నిరాశపడకుండా ఆయన తన తదుపరి ప్రాజెక్టును ఎనౌన్స్ చేశాడు. తమిళ దర్శకుడు లింగుసామితో ఒక సినిమా చేయనున్నట్టుగా చెప్పాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమా చిత్రీకరణ జరుగనుంది. అయితే ఎనౌన్స్ చేసిన తరువాత నుంచి కూడా లాక్ డౌన్ నడుస్తూనే వచ్చింది. అందువలన ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లలేకపోయింది.

ఇక ఇప్పుడు కరోనా కాస్త అదుపులోకి రావడంతో, ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. వచ్చేనెల రెండవ వారంలో షూటింగు మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టిని తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె నాని .. సుధీర్ బాబు సినిమాలతో బిజీగా ఉంది. ఆ సినిమాలు పూర్తిచేసిన తరువాత ఈ ప్రాజెక్టుపైకి రానుంది. ఇక రామ్ తో కలిసి ఆమె చేసే సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.