'గాలి సంపత్' దర్శకుడితో సెట్స్ పైకి నాగశౌర్య!

23-06-2021 Wed 10:42
  • తాజా చిత్రంగా రానున్న 'లక్ష్య'
  • 'వరుడు కావలెను'పై క్రేజ్
  • పట్టాలపైకి మరో సొంత ప్రాజెక్టు
Naga Shaurya with Anish Krishna movie

నాగశౌర్య వరుస సినిమాలతో సిద్ధమైపోతున్నాడు. ఒక వైపున సొంత బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తూనే .. మరో వైపున బయట బ్యానర్లలోను చేస్తున్నాడు. ఆయన నుంచి రావడానికి 'లక్ష్య' సినిమా రెడీ అవుతోంది. ఇక ఆ తరువాత సినిమాలుగా 'వరుడు కావలెను' .. 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' .. 'పోలీస్ వారి హెచ్చరిక' సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సొంత బ్యానర్లో మరో ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి నాగశౌర్య సన్నాహాలు చేసుకుంటున్నాడు.

రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాకి, 'గాలి సంపత్'ను తెరకెక్కించిన అనీష్ కృష్ణ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాతో కొత్త హీరోయిన్ ను తెలుగు తెరపైకి పరిచయం చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పై పూర్తిస్థాయి కసరత్తు జరిగిపోయిందట. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 'గాలి సంపత్' సరిగ్గా ఆడకపోవడంతో నిరాశకు లోనైన అనీష్, ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడట. ఇక శ్రీమాన్ అనే దర్శకుడిని కూడా నాగశౌర్య లైన్లో పెడుతున్నాడని చెప్పుకుంటున్నారు.