Andhra Pradesh: ఏపీలో మరో 4,169 మందికి కరోనా పాజిటివ్

AP Covid Positive Cases
  • గత 24 గంటల్లో 74,453 కరోనా పరీక్షలు
  • అత్యధికంగా తూర్పుగోదావరిలో 743 కేసులు
  • విజయనగరం జిల్లాలో 80 మందికి కరోనా
  • రాష్ట్రంలో 53 మరణాలు
ఏపీలో గడచిన 24 గంటల్లో 74,453 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,169 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 743 పాజిటివ్ కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 659 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇతర జిల్లాల్లో 500కి లోపే కొత్త కేసులు వచ్చాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 80 కరోనా కేసులు గుర్తించారు.

అదే సమయంలో 8,376 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, 53 మంది మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో ఏడుగురు కన్నుమూశారు. తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఆరుగురు చొప్పున మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం 12,416 మంది కరోనాతో మృతి చెందారు. ఏపీలో ఇప్పటిదాకా 18,57,352 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 17,91,056 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 53,880 మందికి చికిత్స జరుగుతోంది.
Andhra Pradesh
COVID19
Positive Cases
New Cases
Deaths

More Telugu News