Sensex: ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits
షార్ట్స్‌లో చూడండి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకుపోయాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 482 పాయింట్ల వరకు లాభపడింది. అయితే ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఇంట్రాడే లాభాలు హరించుకుపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్లు లాభపడి 52,588కి చేరుకుంది. నిఫ్టీ 26 పాయింట్ల లాభంతో 15,772 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి సుజుకి (5.11%), ఎల్ అండ్ టీ (2.19%), టైటాన్ కంపెనీ (0.96%), టీసీఎస్ (0.91%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.87%).

టాప్ లూజర్స్:
ఏసియన్ పెయింట్స్ (-2.10%), బజాజ్ ఫైనాన్స్ (-1.66%), నెస్లే ఇండియా (-1.26%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.14%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.87%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News