TTD: శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేసిన టీటీడీ

  • జులై నెల కోటాను విడుదల చేసిన టీటీడీ
  • రోజుకు 5 వేల టికెట్ల వంతున కేటాయింపు
  • భక్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్న అధికారులు
TTD releases Srivari online tickets for July month

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త. జులై నెలకు గాను స్వామి వారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. రోజుకు 5 వేల టికెట్ల వంతున జులై నెల కోటాను విడుదల చేసింది. రూ. 300 దర్శనం టికెట్లను టీటీడీ అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది.

కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో టికెట్లను కేటాయిస్తున్నట్టు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. దర్శన సమయంలో భక్తులు కచ్చితంగా మాస్కులు ధరించాలని కోరారు. https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్లో భక్తులు తమ దర్శనం టికెట్లు, గదులను బుక్ చేసుకోవచ్చు.

More Telugu News