Raghuram Rajan: తమిళనాడు ఆర్థిక సలహా సంఘంలో రఘురాం రాజన్‌, ఎస్తర్‌ డఫ్లో

Rajan and Esther Duflo in TNs Economic advisory Council
  • మొత్తం ఐదుగురు సభ్యులతో సంఘం ఏర్పాటు
  • ఆర్థికపరమైన అంశాల్లో సీఎంకు సలహాలు ఇవ్వనున్న కమిటీ
  • మరో ముగ్గురూ ఆర్థిక రంగంలో అపార అనుభవం ఉన్నవారే
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని వెల్లడి
  • భర్త అభిజిత్‌ బెనర్జీతో కలిసి నోబెల్‌ పొందిన ఎస్తర్‌ డఫ్లో
తమిళనాడు ప్రభుత్వం సోమవారం సీఎంకు ఆర్థికపరమైన విషయాల్లో సహకారం అందించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ఓ సలహా సంఘాన్ని ప్రకటించింది. దీంట్లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ సహా, భర్త అభిజిత్‌ బెనర్జీతో కలిసి నోబెల్‌ పురస్కారాన్ని అందుకున్న ఎస్తర్‌ డఫ్లోకు స్థానం దక్కింది. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక, సామాజిక పరమైన అంశాలపై ఈ సంఘం సీఎం స్టాలిన్‌కు సలహాలు అందించాల్సి ఉంటుంది.

కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌, సంక్షేమ ఆర్థశాస్త్రవేత్త జీన్‌ డ్రెజ్‌, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, ప్రధాని మోదీకి ఆర్థిక సలహాదారుగా వ్యవహరించిన ఎస్‌.నారాయణ్‌కి ఈ సలహా సంఘంలో చోటు దక్కింది. అధిక అప్పులు, ఆర్థిక లోటు వంటి సమస్యలతో రాష్ట్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో ప్రభుత్వంపై ప్రజల ఆశలు భారీ ఎత్తున ఉన్నాయని పేర్కొంది.
Raghuram Rajan
Esther Duflo
Tamilnadu
Economic Council

More Telugu News