తెలంగాణలో గత 24 గంటల్లో 1,197 కరోనా కేసులు

21-06-2021 Mon 19:05
  • జీహెచ్ఎంసీ పరిధిలో 137 మందికి కరోనా
  • జిల్లాల్లో 100కి లోపే కొత్త కేసులు
  • అత్యల్పంగా నిర్మల్ లో 1 కేసు
  • రాష్ట్రంలో 9 మంది మృతి
Corona positive cases in Telangana

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,19,537 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,197 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈసారి కూడా జీహెచ్ఎంసీ (137) పరిధిలోనే అత్యధిక కేసులు వచ్చాయి. జిల్లాల్లో ఎక్కడా 100కు మించి కరోనా కేసులు నమోదు కాలేదు. అత్యల్పంగా నిర్మల్ జిల్లాలో 1 పాజిటివ్ కేసును గుర్తించారు. అదే సమయంలో 1,707 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి మొత్తం కరోనా మృతుల సంఖ్య 3,576కి పెరిగింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,14,399 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 5,93,577 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 17,246 మంది చికిత్స పొందుతున్నారు.