'మా’ అధ్యక్షుడి ఎన్నిక‌ల బ‌రిలోకి మంచు విష్ణు

21-06-2021 Mon 17:05
  • పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకాశ్ రాజ్ ప్రకటన
  • చిరంజీవిని కలిసిన తర్వాత ప్రకటన చేయనున్న విష్ణు
  • చిరు కుటుంబంతో మోహన్ బాబు కుటుంబానికి సన్నిహిత సంబంధాలు
Manchi Vishnu to contest as MAA president

తెలుగు సినీ పరిశ్రమలో హడావుడి మొదలైంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రకాశ్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీపడనున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అధ్యక్ష బరిలోకి హీరో మంచు విష్ణు కూడా దిగనున్నట్టు తెలుస్తోంది.

దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడనుందని చెపుతున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవిని కలిసిన తర్వాతే దీనిపై విష్ణు ప్రకటన చేస్తాడని సమాచారం. చిరంజీవి కుటుంబంతో మోహన్ బాబు కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే.