Santosh Shobhan: నిర్మాతగా చిరూ కూతురు .. హీరోగా సంతోష్ శోభన్!

Santosh Shobhan as a hero in 8 Thottakkal movie
  • తమిళంలో హిట్ కొట్టిన '8 తొట్టక్కల్'
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు
  • త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు
  • దర్శకుడిగా శ్రీ గణేశ్
ఆమధ్య చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ బ్యానర్ పై ఆమె వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ వెళుతోంది. ఇక సినిమాలను కూడా నిర్మించాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగాలనుకునే సరికి కరోనా అడ్డుపడింది. అందువలన కొంతకాలంగా ఆమె వెయిట్ చేస్తూ వచ్చింది. ఇక ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గుతూ వెళుతుండటంతో, తన సినిమాకి సంబంధించిన సన్నాహాలను ఆమె మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. కథకి తగిన హీరో కోసం కొంతకాలంగా అన్వేషిస్తున్న ఆమె, సంతోష్ శోభన్ ను ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు.

నిర్మాతగా మారాలని నిర్ణయించుకోగానే ఆమె ఆ మధ్య తమిళంలో హిట్ కొట్టిన '8 తొట్టక్కల్' అనే తమిళ సినిమా రీమేక్ హక్కులు తీసుకుంది. తమిళంలో వెట్రి - అపర్ణ బాలమురళి జంటగా నటించిన ఈ సినిమాకి శ్రీ గణేశ్ దర్శకత్వం వహించాడు. తెలుగు వెర్షన్ కి కూడా ఆయననే దర్శకుడిగా తీసుకున్నారని అంటున్నారు. ఈ సినిమాలో హీరో .. ఓ పోలీస్ ఆఫీసర్. ఇప్పటివరకూ ప్రేమకథా చిత్రాలలో మాత్రమే చేస్తూ వచ్చిన సంతోష్ శోభన్, ఒక పోలీస్ ఆఫీసర్ గా ఎలా మెప్పిస్తాడో చూడాలి మరి. త్వరలోనే ఈ ప్రాజెక్టును గురించిన మిగతా వివరాలు తెలియనున్నాయి.
Santosh Shobhan
Susmitha
8 Thottakkal remake

More Telugu News