Mixico: కార్లలో తిరుగుతూ మారణహోమం సృష్టించిన దుండగులు.. మెక్సికోలో 15 మంది మృతి

At least 15 dead after multiple attacks near US Mexico border
షార్ట్స్‌లో చూడండి
మెక్సికోలో దుండగులు చెలరేగిపోయారు. కార్లలో తిరుగుతూ మారణహోమం సృష్టించారు. విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 15 మంది మరణించారు. అమెరికా-మెక్సికో సరిహద్దు రాష్ట్రమైన రేనోసోలో జరిగిందీ ఘటన. కొందరు దుండగులు కార్లలో తిరుగుతూ జనంపై తూటాల వర్షం కురిపించారు. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు.

వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. అతడి కారు డిక్కీలో బంధించిన ఇద్దరు మహిళలను రక్షించాయి. ఆ ఇద్దరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మాఫియా ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఇక్కడ గల్ఫ్ కార్టెల్ ముఠాలో ఇటీవల విభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో వరుసదాడులు జరుగుతున్నాయి.
Go Back to Shorts
Mixico
America
Reynosa
America-mexico Border

More Telugu News