కరోనా వ్యాక్సినేషన్ లో ఏపీ జాతీయ రికార్డు

20-06-2021 Sun 21:11
  • ఒక్కరోజే 13 లక్షల డోసులు
  • గతంలో ఒక్కరోజే 6 లక్షల డోసులతో ఏపీ రికార్డు
  • తన రికార్డును తానే తిరగరాసిన వైనం
  • జాతీయస్థాయిలో ఏపీ వాటా 47 శాతం
AP creates national record in Corona vaccination with highest doses in single day

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమన్న నేపథ్యంలో, ఎక్కడ చూసినా వ్యాక్సినేషన్ కార్యక్రమాలు ముమ్మరంగా చేపడుతున్నారు. ఇవాళ ఏపీలోనూ భారీ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ క్రమంలో ఏపీ కరోనా వ్యాక్సినేషన్ లో జాతీయ రికార్డు నమోదు చేసుకుంది. ఒకే రోజు 13,26,271 డోసుల వేక్సినేషన్ తో తన రికార్డును తానే తిరగరాసింది. గతంలో ఏపీలో ఒక్కరోజులో 6 లక్షల మందికి డోసులు ఇవ్వడం ఇప్పటిదాకా జాతీయ రికార్డుగా ఉంది.

కాగా, ఇవాళ జాతీయస్థాయిలో నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్ లో ఏపీ వాటా 47 శాతం కావడం విశేషం. ఏపీ తర్వాత రాజస్థాన్ లో 12 శాతం వ్యాక్సినేషన్ జరగ్గా, గుజరాత్ లో 7 శాతం, తెలంగాణలో 4 శాతం వ్యాక్సినేషన్ జరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.