Harish Rao: కాన్వాయ్ కు అడ్డొచ్చిన అడవిపంది.. మంత్రి హరీశ్ రావుకు తప్పిన ప్రమాదం

Telangana minister Harish Rao escapes unhurt
  • సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వెళుతున్న హరీశ్ రావు
  • ఉన్నట్టుండి రోడ్డుపైకి వచ్చిన అడవిపంది
  • సడెన్ బ్రేక్ వేసిన డ్రైవర్
  • ఒకదాన్నొకటి ఢీకొన్న వాహనాలు
తెలంగాణ మంత్రి హరీశ్ రావు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇవాళ ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. అందుకు కారణం... ఓ అడవిపంది అడ్డురావడమే. మంత్రి హరీశ్ రావు కాన్వాయ్ సిద్ధిపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో పంది చనిపోయినట్టు తెలుస్తోంది.

ఓ అడవిపంది ఉన్నట్టుండి రోడ్డుపైకి వచ్చింది. దాంతో కాన్వాయ్ లోని వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దాంతో కాన్వాయ్ లో వెనుకగా వస్తున్న ఇతర వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మంత్రి హరీశ్ రావు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కాన్వాయ్ తిరిగి హైదరాబాద్ బయల్దేరింది. నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధిపేటలో పర్యటించిన నేపథ్యంలో, ఆర్థికమంత్రి హరీశ్ రావు కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Harish Rao
Convoy
Wildbore
Siddipet
Hyderabad
Telangana

More Telugu News