తన సిబ్బంది మొత్తానికి కరోనా వ్యాక్సినేషన్ చేయించిన దిల్ రాజు

20-06-2021 Sun 19:51
  • ఎస్వీసీ బ్యానర్ పై చిత్రాలు నిర్మిస్తున్న దిల్ రాజు
  • ఎస్వీసీ బ్యానర్లో 200 మంది సిబ్బంది
  • సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తపడిన దిల్ రాజు
  • చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయంలో నేడు వ్యాక్సినేషన్
Dil Raju conducts vaccination for his SVC staff

టాలీవుడ్ లోని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల్లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్వీసీ) ఒకటి. నిర్మాతగా తన అభిరుచికి అద్దంపట్టేలా చిత్రాలు నిర్మిస్తూ ముందుకు సాగుతున్న దిల్ రాజ్ ఆధ్వర్యంలోని ఈ బ్యానర్లో 200 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దిల్ రాజు తన సిబ్బంది ఆరోగ్యం పట్ల అప్రమత్తత ప్రదర్శించారు.

తన నిర్మాణ సంస్థ కార్యాలయంలో నేడు వ్యాక్సినేషన్ ఏర్పాటు చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో పనిచేసే 200 మంది సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ డోసులు ఇప్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్ర నిర్మాణ సంస్థ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పంచుకుంది.