India: డబ్ల్యూటీసీ ఫైనల్: ఆట ఆరంభంలోనే కోహ్లీ అవుట్

India lost captain Kohli wicket on early second day play
  • సౌతాంప్టన్ లో డబ్ల్యూటీసీ ఫైనల్
  • భారత్ వర్సెస్ న్యూజిలాండ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్
  • ఆదుకున్న కోహ్లీ-రహానే జోడీ
  • జోడీని విడదీసిన జేమీసన్
న్యూజిలాండ్ తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ కష్టాల్లో పడింది. ఇవాళ ఆట ఆరంభంలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ చేజార్చుకుంది. 44 పరుగులు చేసిన కోహ్లీ కివీస్ పేసర్ కైల్ జేమీసన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 4 వికెట్లకు 149 పరుగులు కాగా, క్రీజులో అజింక్యా రహానే (32), రిషబ్ పంత్ ఉన్నారు. కాగా, వరుణుడు ఇవాళ్టి ఆటపైనా ప్రభావం చూపాడు. వర్షం కారణంగా ఆట ఆలస్యంగా ప్రారంభమైంది.

భారత ఇన్నింగ్స్ లో ఓపెనర్లు రోహిత్ శర్మ 34, శుభ్ మాన్ గిల్ 28 పరుగులు చేశారు. పుజారా 8 పరుగులకే అవుట్ కాగా, కోహ్లీ-రహానే జోడీ కీలక భాగస్వామ్యంతో జట్టు స్కోరును 100 పరుగులు దాటించింది. ఈ జోడీని జేమీసన్ విడదీశాడు. ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకోవడం తెలిసిందే
India
Virat Kohli
Wicket
Kyle Jamieson
New Zealand
WTC Final
Southampton
England

More Telugu News