NEET: ఇదేం సామాజిక న్యాయమంటూ ‘నీట్’పై ధ్వజమెత్తిన సినీ నటుడు సూర్య

  • ‘నీట్’ను వ్యతిరేకిస్తున్న తమిళనాడు
  • అభిప్రాయ సేకరణ కోసం రిటైర్డ్ జడ్జి సారథ్యంలో కమిటీ
  • వేర్వేరు విద్యా విధానాలు ఉన్నప్పుడు ఒకే పరీక్ష ఏమిటని ప్రశ్న
kollywood actor suriya oppose NEET

వైద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష ‘నీట్’పై కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటుడు సూర్య ధ్వజమెత్తాడు. ‘నీట్’ను తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తుండడంతో దీనిపై అభిప్రాయ సేకరణ కోసం రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఏకే రాజన్ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పలువురు తమ అభిప్రాయాలను నివేదిస్తున్నారు. ‘అగరం ఫౌండేషన్’ పేరుతో విద్యా సంస్థను నడుపుతున్న ప్రముఖ నటుడు సూర్య కూడా ఈ కమిటీకి తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

సమాజంలో పేద, ధనిక అనే రెండు వర్గాలకు రెండు వేర్వేరు విద్యావిధానాలు అమలవుతున్నాయని, అలాంటప్పుడు విద్యార్థుల అర్హతలను తేల్చేందుకు జాతీయ స్థాయిలో ఒకే పరీక్షా విధానాన్ని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించాడు. ఇది ఎలా సరైన విధానమో చెప్పాలని డిమాండ్ చేశాడు. ప్రజలు, విద్యావేత్తలు కూడా ముందుకొచ్చి ఈ కమిటీకి తమ అభిప్రాయాలు తెలియజేయాలని పిలుపునిచ్చాడు.

More Telugu News