ప్రత్యేక విమానంలో అమెరికాకు బ‌య‌లుదేరిన ర‌జ‌నీకాంత్

19-06-2021 Sat 11:10
  • దాదాపు మూడు నెలల పాటు అక్కడే విశ్రాంతి
  • 2011లో కిడ్నీ సంబంధిత సమస్యకు చికిత్స‌
  • పదేళ్లు కావడంతో ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షలు
rajni to reach usa

సౌతిండియా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ వైద్య పరీక్షల కోసం అమెరికా బ‌య‌లుదేరారు. ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలసి బ‌య‌లుదేరిన ర‌జ‌నీ దాదాపు మూడు నెలల పాటు అక్కడే విశ్రాంతి తీసుకోనున్నారు. ర‌జ‌నీ 2011లో కిడ్నీ సంబంధిత సమస్యకు సింగపూర్‌లో వైద్యం చేయించుకున్న విష‌యం తెలిసిందే. అనంత‌రం అమెరికా వెళ్లి పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

కిడ్నీ  చికిత్స చేయించుకుని పదేళ్లు కావడంతో ఇప్పుడు మరోసారి వైద్య పరీక్షల కోసం అమెరికాకు వెళ్తున్నారు.  ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్.. శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ సినిమాలో నటిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్‌ కరోనా వైరస్ రెండో ద‌శ విజృంభ‌ణ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో నయనతార, ఖుష్బూ, మీనా, జగపతి బాబు, కీర్తి సురేశ్ న‌టిస్తున్నారు.