డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కు టీమిండియా ఎంపిక

17-06-2021 Thu 20:38
  • రేపు డబ్ల్యూటీసీ ఫైనల్
  • ఇంగ్లండ్ లోని సౌతాంప్టన్ లో మ్యాచ్
  • అనుభవానికే పెద్దపీట వేసిన భారత మేనేజ్ మెంట్
  • తుదిజట్టులో కీలక ఆటగాళ్లకే చోటు
Team India announced for WTC Final against New Zealand

రేపు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఆడే భారత తుది జట్టును ప్రకటించారు. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ గా అజింక్యా రహానే వ్యవహరిస్తారు. జట్టులో ఎలాంటి కొత్త ముఖాలను తీసుకోలేదు. రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ జోడీ ఇన్నింగ్స్ ఆరంభించనుంది. వికెట్ కీపర్ గానూ, బ్యాట్స్ మన్ గానూ విశేషంగా రాణిస్తున్న రిషబ్ పంత్ కు తుది జట్టులో స్థానం దక్కింది. ఈ టైటిల్ సమరం కోసం టీమిండియా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతోంది. బుమ్రా, ఇషాంత్ శర్మ, షమీ పేస్ బాధ్యతలను మోయనుండగా, అశ్విన్, జడేజా స్పిన్ సేవలు అందించనున్నారు.